సినిమా వార్తలు

'సీత' పాత్రలో కాజల్


9 months ago 'సీత' పాత్రలో కాజల్

కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్, హీరోయిన్ కాజల్ జంటగా తెరకెక్కిన 'కవచం' ప్రస్తుతం థియేటర్లలో విజయవతంగా ఆడుతోంది. ఈ సినిమా  తమకి మంచి పేరు తెస్తుందనే నమ్మకంతో వీరిద్దరూ వున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లోనే తేజ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఈ కథ అంతా కాజల్ పాత్ర చుట్టూనే తిరుగుతుందట. అందుకే టైటిల్ కూడా కాజల్ పాత్ర ను అనుసరించి 'సీత' అని పెట్టనున్నట్టుగా తెలుస్తోంది. టైటిల్ కాజల్ పాత్రను బట్టి ఉంటుందని తేజ చెప్పినప్పటికీ, బెల్లంకొండ శ్రీనివాస్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని సమాచారం. తొలి సినిమాతోనే మాస్ హీరోగా గుర్తింపు దక్కించకున్న బెల్లంకొండ శ్రీనివాస్, ఆ తరువాత మాస్ ఆడియన్స్ కి నచ్చే అంశాలు తన సినిమాల్లో ఉండేలా జాగ్రత్తపడుతూ వస్తున్నారు. అలాగే తన సినిమాల్లో భారీతనం తగ్గకుండా కూడా జాగ్రత్త పడుతున్నాడు. ఈ విధంగావున్న బెల్లంకొండ శ్రీనివాస్ నాయికా ప్రాధాన్యత కలిగిన 'సీత' సినిమాను చేయడం విశేషమని బోగట్టా.