సినిమా వార్తలు

అఖిల్ మూవీలో కాజల్?


1 year ago అఖిల్ మూవీలో కాజల్?

ప్రస్తుతం యువ హీరో అక్కినేని అఖిల్ తన మూడవ సినిమా షూటింగులో బిజీగా వున్నారు. గతంలో అఖిల్ చేసిన రెండు సినిమాలు ఆశించిన స్థాయి విజయాన్ని అందివ్వలేకపోయాయి. అందుకే ఈ సినిమాతో తప్పకుండా ఆయనకి హిట్ ఇవ్వాలని దర్శకుడు వెంకీ అట్లూరి గట్టిగా కృషిచేస్తున్నారు. అఖిల్ ను కొత్తగా చూపించడమే కాకుండా .. కథాకథనాల్లోను కొత్తదనాన్ని చూపించే పనిలో ఆయన వున్నారని తెలుస్తోంది. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో కాజల్ ఒక కీలకమైన రోల్ పోషిస్తున్నదని సమాచారం. ఆడియన్స్ ను థ్రిల్ చేయడం కోసం ఈ విషయాన్ని యూనిట్ సీక్రెట్‌గా ఉంచినట్టు తెలుస్తోంది.

ఈ సినిమాలో కాజల్ క్యారెక్టర్ ఏమై ఉంటుంది? అనేది ఆసక్తికరంగా మారింది. 'మిస్టర్ మజ్ను' టైటిల్ తో ఈ సినిమాను డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది. మరోవైపు తమిళంలో మరో భారీ ఆఫర్ కాజల్ ను వరించినట్టు తెలుస్తోంది.  తమిళంలో సూపర్ హిట్టైన తనిఒరువన్ సినిమాకు సీక్వెల్ చేస్తున్నట్టు దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు.  జయం రవి హీరోగా నటించగా, అతని తమ్ముడు మోహన్ రాజా దర్శకుడుగా పనిచేశారు.  దీని సీక్వెల్ కు సంబంధించిన కథను ఇప్పటీకే సిద్ధం చేశారని సమాచారం.  తనిఒరువన్ లో నయనతార హీరోయిన్ గా నటించింది.  సీక్వెల్ లో కూడా ఆమె నటిస్తుందని అనుకున్నారు. అయితే నయనతార ప్లేస్ లో కాజల్ ను ఎంపిక చేశారని తెలుస్తోంది.