సినిమా వార్తలు

కుర్ర హీరోలకు కాజల్ గ్రీన్ సిగ్నల్... అయితే ‘భారీ’ కండీషన్?


1 year ago కుర్ర హీరోలకు కాజల్ గ్రీన్ సిగ్నల్... అయితే ‘భారీ’ కండీషన్?

సాధారణంగా సీనియర్ నటిగా మారుతున్నదశలో అవకాశాలు తగ్గిపోతుంటాయి. అదేవిధంగా రెమ్యూనరేషన్ తగ్గిపోతుంటుంది. కానీ కాజల్ వీటిన్నటికి అతీతంగా ఎదిగిపోతోంది. అందాల భామ కాజల్ అగర్వాల్ దశాబ్దకాలంగా టాలీవుడ్‌ను మహారాణిలా ఏలుతోంది. వయసు పెరుగుతున్నప్పటికీ, యువ హీరోయిన్ల నుంచి గట్టిపోటీ ఉన్నా కాజల్ తన దైన నటన, గ్లామర్‌తో స్థానాన్ని పదిలంగా కాపాడుకుంటోంది. చిరంజీవి,  ఇటీవల కాలంలో ఖైదీ నంబర్ 150 చిత్రంలో మెగాస్టార్ చిరంజీవితో, నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో రానా దగ్గుబాటితో నటించి మెప్పించింది. జనతా గ్యారేజ్ చిత్రంలో ఐటెం నంబర్‌తో అలరించింది. అటు హిందీలోనూ, తమిళంలోనూ స్టార్ హీరోలతో జతకడుతోంది. తాజా టాలీవుడ్‌లో ఓ యువ హీరోతో జతకట్టేందుకు సిద్ధమైందని సమాచారం. బెల్లంకొండ శ్రీనివాస్ నటించే కొత్త చిత్రంలో నటించేందుకు కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చర్చనీయాంశంగామారింది. ఈ చిత్రం కోసం తన కెరీర్‌లోనే మునుపెన్నడూ లేని విధంగా భారీ రెమ్యునరేషన్ అందుకొన్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో నటించేందుకు రూ.1.75 కోట్ల పరితోషికాన్ని తీసుకొన్నట్టు సినీ వర్గాల భోగట్టా. యువ హీరోయిన్లకు గట్టిపోటి టాలీవుడ్ మార్కెట్లో యువ తారలు పూజా హెగ్డే, కియారా అద్వానీ లాంటి తారలు అందుబాటులో ఉన్నారు. అందంతోనూ, అభినయంతోనూ ఆకట్టుకొంటున్నారు. ఇంకా తక్కువ రెమ్యునరేషన్‌కు కూడా రెడీగా ఉండే వాళ్లు ఉన్నారు. అయితే కాజల్‌కు భారీగా రెమ్యునరేషన్ ఇచ్చి నటింపజేయడం చర్చనీయాంశంగా మారింది.  ఈ చిత్రం ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో షూటింగ్ జరుపుకొంటున్నదని సమాచారం.