సినిమా వార్తలు

ఇప్పుడు అటువంటి ఆలోచనలేదు: కాజల్


9 months ago ఇప్పుడు అటువంటి ఆలోచనలేదు: కాజల్

ఆ మధ్య హీరోయిన్ కాజల్ కెరియర్ గ్రాఫ్ కాస్త మందగించినట్టుకనిపించినా, ఆ తరువాత మళ్లీ పుంజుకుంది. వరుస అవకాశాలతో ఆమె ముందుకు దూసుకుపోతోంది. అటు సీనియర్ హీరోల సరసన, ఇటు యువ హీరోలకు జోడీగా ఆమె ప్రేక్షకులను అలరిస్తోంది. ఆమె తాజా చిత్రం 'కవచం'.. ఈ నెల 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ .. "ఈ సినిమాలో నా పాత్రకి చాలా ప్రాముఖ్యత వుంది .. అందుకే ఈ చిత్రం చేయడానికి అంగీకరించాను. నా పాత్రకి మంచి గుర్తింపు వస్తుందనే బలమైన నమ్మకం వుంది.

తమిళ రీమేక్ గా చేసే 'క్వీన్' .. తెలుగులో తేజ దర్శకత్వంలో చేసే సినిమాలు నాకు మరింత గుర్తింపును తెచ్చిపెడతాయి. ఇక 'భారతీయుడు 2'లో కమల్ సరసన చేసే ఛాన్స్ రావడాన్ని నేనే నమ్మలేకపోతున్నాను. ఈ మధ్య అందరూ నా పెళ్లి గురించి అడుగుతున్నారు .. నాకూ చేసుకోవాలనే వుంది .. అయితే చేతినిండా సినిమాలు వున్నాయి .. అందువలన పెళ్లి గురించి ఇప్పుడు ఆలోచించడం లేదు" అని స్పష్టం చేసింది కాజల్.