సినిమా వార్తలు

కైరా కళ్లు సూపర్ : రామ్ చరణ్


8 months ago కైరా కళ్లు సూపర్ : రామ్ చరణ్

రామ్‌చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'వినయ విధేయ రామ' సినిమా నిర్మితమైంది. కైరా అద్వాని కథానాయిక. ఈ సినిమా ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో చరణ్ బిజీగా వున్నాడు. తాజా ఇంటార్వ్యూలో ఆయన మాట్లాడుతూ "ఈ సినిమాలో పేరుకి తగినవిధంగానే నా పాత్ర ఉంటుంది.  రాముడితో యుద్ధం చేయాలని ఎవరూ అనుకోకూడదు. నేను కూడా ఈ సినిమాలో అలాగే కనిపిస్తాను. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో ఒంటినిండా టాటూలతో కనిపిస్తాను. అది స్టిక్కర్లతో వేసిన టాటూ. వాటిని వేయడానికి 2 గంటలు తీయడానికి గంటన్నర సమయం పట్టేది. ఆ స్టిక్కర్ తీసేటప్పుడు చాలానొప్పిగా ఉండేది. అయినా అలాగే భరించాను. గతంలో తమన్నా మంచి డాన్సింగ్ పార్ట్నర్ అనిపించింది. మళ్లీ ఇప్పుడు కైరా అద్వాని మంచి డాన్సింగ్ పార్ట్నర్ గా అనిపిస్తోంది" అని పేర్కొన్నారు. ఇక కైరా అద్వాని కళ్లు కూడా చాలా బాగుంటాయని రామ్ చరణ్ కితాబిచ్చాడు.