సినిమా వార్తలు

‘RRR’కోసం బరువు పెరిగిన ఎన్టీఆర్


10 months ago ‘RRR’కోసం బరువు పెరిగిన ఎన్టీఆర్

రాజమౌళి తన సినిమాకు సంబంధించిన ప్రతి అంశంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారనేది విదితమే. 'బాహుబలి' నిర్మాణ సమయంలో ఆయా పాత్రధారుల లుక్స్ బయటికి రాకుండా ఉండటం కోసం రాజమౌళి లొకేషన్ లోకి సెల్ ఫోన్లు అనుమతించలేదు. ప్రస్తుతం షూటింగు జరుపుకుంటోన్న 'ఆర్ ఆర్ ఆర్' సినిమా విషయంలోను ఆయన అదే విధానాన్ని అనుసరిస్తున్నారని తెలుస్తోంది.

ఈ సినిమాలో చరణ్ .. ఎన్టీఆర్ ఇద్దరూ కూడా డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నారని సమాచారం. హెయిర్ స్టయిల్, మీసకట్టు, వస్త్రధారణ విషయంలో చరణ్ డిఫరెంట్ గా కనిపించనున్నాడని సమాచారం. అలాగే ఎన్టీఆర్ బాగా బరువు పెరిగి కాస్త లావుగానే కనిపించనున్నాడని సమాచారం. 'అరవింద సమేత'లో సిక్స్ ప్యాక్ లో కనిపించిన ఎన్టీఆర్ ను, అందుకు పూర్తి భిన్నమైన లుక్ లో రాజమౌళి చూపించనున్నారట. దీంతో కెరియర్ ఆరంభంలో మాదిరిగా ఎన్టీఆర్  చాలాబొద్దుగానే కనిపించనున్నాడని అభిమానులు చెప్పుకుంటున్నారు.