సినిమా వార్తలు

ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్?


9 months ago ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్?

క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ రూపొందుతున్న విషయం విదితమే. మొదటిభాగమైన 'కథానాయకుడు'కి సంబంధించిన సన్నివేశాలను .. పాటలను వేగంగా చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే ఈ భాగానికి సంబంధించిన చిత్రీకరణ చాలావరకూ పూర్తయిందని తెలుస్తోంది. ఈ సినిమా ఆరంభంలో ఎన్టీ రామారావు గురించిన వాయిస్ ఓవర్ ఉంటుందట. ఆ వాయిస్ ఓవర్ ను యంగ్ ఎన్టీఆర్ తో చెప్పించాలనే ఆలోచనలో టీమ్ ఉందని తెలుస్తోంది. అదే జరిగితే ఈ సినిమాకి అది ప్రత్యేకమైన ఆకర్షణ అవుతుందని సమాచారం.

సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.ఈ సినిమాలో శ్రీదేవిగా రకుల్ .. జయప్రదగా తమన్నా కనిపించనున్నారు. దివంగత నేత ఎన్టీఆర్ జీవిత కథతో, బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న రెండు భాగాల చిత్రంలో ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుగా భరత్ రెడ్డి నటిస్తున్నాడు. ఈ చిత్రంలో భరత్ రెడ్డి ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ వెనక నిలబడి ఉన్న దగ్గుబాటిగా భరత్ రెడ్డి అలరిస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్, దగ్గుబాటి మధ్య వచ్చే సన్నివేశాలను దర్శకుడు క్రిష్ తెరకెక్కించినట్టు సమాచారం.