సినిమా వార్తలు

వైజ‌యంతీ మూవీస్ లో ఎన్టీఆర్?


11 months ago వైజ‌యంతీ మూవీస్ లో ఎన్టీఆర్?

వైజ‌యంతీ మూవీస్ సంస్థ త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీకి ఒక సినిమాకోసం అడ్వాన్సు అందజేసిందట. అయితే అట్లీ సినిమాఎవ‌రితో అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. అటు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ఇటు ఎన్టీఆర్ ఇద్ద‌రూ లైన్‌లో ఉన్నారని సమాచారం. ఇద్ద‌రిలో ఎవ‌రితోనైనా ఈప్రాజెక్టు ముందుకు వెళ్లొచ్చ‌న్నారు అశ్వ‌నీద‌త్‌. అయితే ఇప్పుడు అది ఎన్టీఆర్‌కి ఫిక్స‌యిపోయిన‌ట్టు స‌మాచారం అందుతోంది. `మెర్స‌ల్‌` స‌మ‌యంలోనే ఎన్టీఆర్ – అట్లీ మ‌ధ్య సంప్ర‌దింపులు జ‌రిగాయట. ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉండ‌డం వ‌ల్ల‌.. అట్లీకి స‌మ‌యం కేటాయించ‌లేక‌పోయారు.

అట్లీ కూడా త‌న సినిమాల‌తో తాను బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్‌.. ప్ర‌మేయం వ‌ల్లే… వైజ‌యంతీ మూవీస్ ఈ ప్రాజెక్టులోకి ఎంట‌రైంద‌ని, అట్లీ చేతిలో అడ్వాన్సుపెట్టేసింద‌ని, ఇదంతా `మ‌హాన‌టి` కంటే ముందే జ‌రిగిన క‌థ అని తెలుస్తోంది. మ‌రోవైపు విజ‌య్ దేవ‌ర‌కొండ‌క కోసం కూడా వైజ‌యంతీ క‌థ‌లు సిద్ధం చేస్తోంది. బాలీవుడ్ ద‌ర్శ‌క ద్వ‌యం రాజ్ – డీకే విజ‌య్ తో ఓ సినిమా చేయ‌బోతున్నారు. క‌థ ఇప్ప‌టికే సిద్ధ‌మైంది. కాక‌పోతే విజ‌య్ బిజీ షెడ్యూల్స్ వ‌ల్ల అదింకా ప‌ట్టాలెక్క‌లేదు. 2019 ప్ర‌ధ‌మార్థంలో ఈసినిమా మొద‌ల‌య్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.