సినిమా వార్తలు

ఆర్ ఆర్ ఆర్ కోసం ఎన్టీఆర్ దుబాయ్ పయనం


7 months ago ఆర్ ఆర్ ఆర్ కోసం ఎన్టీఆర్ దుబాయ్ పయనం

రాజమౌళి రూపొందిస్తున్న భారీ మల్టీస్టారర్‌కు కొద్ది రోజులు బ్రేక్ పడిందని అంటున్నారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ నిర్వహిస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. చెర్రీ ‘ఆర్ఆర్ఆర్’లో రామరాజు అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి విరామమిచ్చారో లేక ఎన్టీఆర్‌కు సంబంధించిన ఈ షెడ్యూల్ షూటింగ్ పూర్తయిందో కానీ యంగ్ టైగర్ మాత్రం ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లారని తెలుస్తోంది. అయితే అక్కడ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూనే.. మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’లో తన పాత్రకు కావల్సిన కాస్ట్యూమ్స్ కొనుక్కోవడంతో పాటు బాడీ మేకోవర్‌ని మెరుగుపరుచుకునేందుకు స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారని సమాచారం. కాగా ఈ నెలాఖరు వరకూ జూనియర్ ఎన్టీఆర్ దుబాయ్‌లోనే ఉంటారని సమాచారం.