సినిమా వార్తలు

జెడీ చక్రవర్తి ఇప్పుడేం చేస్తున్నారంటే..


6 months ago జెడీ చక్రవర్తి ఇప్పుడేం చేస్తున్నారంటే..

తెలుగులో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును జేడీ చక్రవర్తి సొంతం చేసుకున్నారు. ఆయనకి సక్సెస్ లు ఎలా వచ్చాయో, పరాజయాలు కూడా అలాగే వరుసగా పలకరించాయి. దాంతో ఆయన దర్శకుడిగా కూడా మారి కొన్ని సినిమాలను తెరకెక్కించారు. కానీ అవి కూడా ఆయనను నిరాశపరిచాయి. జేడీ చక్రవర్తి ప్రస్తుతం నటుడిగా ఇతర భాషల్లో బిజీగా ఉండటం విశేషం. తమిళంలో ఆయన 'పట్టారై' అనే థ్రిల్లర్ మూవీలో నటించారు. 'మరైందిరుందు పార్కుమ్ మర్మం ఎన్న' అనే మరో తమిళ సినిమాలోను ఒక విలక్షణమైన పాత్రను పోషిస్తున్నారు. ఇక మలయాళంలో నివీన్ పౌలి మూవీ 'మైఖేల్'లో ఒక ప్రత్యేకమైన పాత్రలో జేడీ చక్రవర్తి కనిపించనున్నారు. కన్నడలోను ఆయన రెండు సినిమాలు చేస్తుండటం విశేషం.  మొత్తానికి ఇతర భాషా చిత్రాలతో జేడీ చక్రవర్తి బిజీగానే వున్నారని తెలుస్తోంది.