సినిమా వార్తలు

విజయ్ మీద మనసు పారేసుకున్న జాన్వీ?


8 months ago విజయ్ మీద మనసు పారేసుకున్న జాన్వీ?

విజయ్ దేవరకొండకి అమ్మాయిల్లో వున్న క్రేజ్ గురించి చెప్పనవసరంలేదు. ఆయనతో కలిసి నటించడానికి యువ కథానాయికలు పోటీ పడుతున్నారు. అలాగే ఆయన సినిమాలపై ఎక్కువ శాతం మంది అమ్మాయిలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమంలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరో విజయ్ దేవరకొండ పేరును ప్రస్తావించడం హాట్ టాపిక్ గా మారింది. తెల్లవారి నిద్రలేచేసరికి మేల్ యాక్టర్ గా మారిపోవలసి వస్తే ఎవరిలా మారిపోవాలనుకుంటారు? అనే ప్రశ్నకి ఆమె విజయ్ దేవరకొండ పేరు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.

తాజాగా ఓ వెబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలోను ఆమె విజయ్ దేవరకొండ పేరును ప్రస్తావించారు. 'ఏ హీరోను చూస్తే మీకు క్రష్ కలుగుతుంది? పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది?' అనే ప్రశ్న ఆమెకు ఎదురైంది. అందుకు సమాధానంగా ఆమె విజయ్ దేవరకొండ పేరునే చెప్పారు. 'గీత గోవిందం'లోని 'ఇంకేం ఇంకేం కావాలే ..' పాట అంటే తనకి ఎంతో ఇష్టమని చాలాసార్లు విన్నానని జాన్వీ తెలిపింది.