సినిమా వార్తలు

సౌత్ హీరోతో జాన్వీ సినిమా


9 months ago సౌత్ హీరోతో జాన్వీ సినిమా

తొలి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ కపూర్ ప్రస్తుతం తొలి మహిళా ఐఏఎఫ్‌ పైలట్‌ గుంజన్‌ సక్సేనా జీవితాధారంగా తెరకెక్కనున్న చిత్రంలో నటించనున్నట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ రూపొందించనున్న ఈ చిత్రంలో జాన్వీ ప్రధాన పాత్రలో నటించనున్నట్టు స‌మాచారం. ఈ సినిమా గురించి చర్చించేందుకు జాన్వి.. గుంజన్‌ను కూడా కలిశారట. కాగా, ఈ చిత్రంలో జాన్వీకి జోడిగా ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారని సమాచారం.

బాలీవుడ్‌లో ఇప్పటికే రెండు సినిమాల్లో నటించిన దుల్కర్.. ఈ చిత్రంలో నటిస్తే మూడ‌వ‌ది అవుతుంది. ఎన్నో సాహసాలకు నెలవైన గుంజన్ జీవిత కథను కరణ్ తెరకెక్కించనున్నారని భోగ‌ట్టా. ఇదిలావుండ‌గా ఇటీవ‌ల విజయ్ దేవ‌ర‌కొండ‌తో యాక్ట్ చేయాలనుందని  కాఫీ విత్ కరణ్ షోలో జాన్వీకపూర్ తెలిపారు. దీంతో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. జాన్వీ కామెంట్స్ పై విజయ్ దేవరకొండ స్పందిస్తూ ’త్వరలో జాన్వీ, కరణ్‌ జోహార్‌ లతో కలిసి సినిమా చేస్తానని అనడ‌o విశేషం.