సినిమా వార్తలు

యాత్రలో జగపతిబాబు ‘సస్పెన్స్’లుక్ ఇదే!


8 months ago యాత్రలో జగపతిబాబు ‘సస్పెన్స్’లుక్ ఇదే!

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా 'యాత్ర' సినిమా రూపొందుతోంది. మమ్ముట్టి ప్రధాన పాత్రధారిగా నిర్మితమవుతోన్న ఈ సినిమాకి, మహి.వి రాఘవ్ దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన మమ్ముట్టి పోస్టర్స్, టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి జగపతిబాబు పాత్రకి సంబంధించిన లుక్ ను విడుదల చేశారు. అయితే ఆయన ఎవరిపాత్రలో నటించారనేది రివీల్ చేయలేదు గానీ, డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నాడు. ఆయన పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందనే టాక్ మాత్రం వినిపిస్తోంది.

ప్రస్తుతం జగపతిబాబుకి గల క్రేజ్, ఈ సినిమాకి అదనపు బలంగా నిలుస్తుందని చెప్పవచ్చు. 70 ఎమ్ ఎమ్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాను, ఫిబ్రవరి 8న అత్యధిక థియేటర్లలో విడుదల చేయనున్నారు. వైఎస్ అభిమానులంతా ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.