సినిమా వార్తలు

‘యాత్ర’ సన్సేషన్: జగన్ పాత్రలో విజయ్ దేవరకొండ?


1 year ago ‘యాత్ర’ సన్సేషన్: జగన్ పాత్రలో విజయ్ దేవరకొండ?

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రగా 'యాత్ర' సినిమా రూపొందుతున్న విషయం విదితమే. మహి.వి రాఘవ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తున్నారు. ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను పూర్తయ్యింది. ఈ సినిమాలో జగన్ పాత్రలో ఏ హీరో నటించనున్నాడనేది ఇంతవరకూ ఆసక్తికరంగా మారింది. సూర్య గానీ, ఆయన తమ్ముడు కార్తీ గాని జగన్ పాత్రలో కనిపించవచ్చనే టాక్ కూడా వినిపించింది.

తాజాగా ఈ పాత్ర కోసం విజయ్ దేవరకొండ పేరు తెరపైకి వచ్చింది. తెలుగులో ఇప్పుడు యూత్ లో విజయ్ దేవరకొండకి విపరీతమైన క్రేజ్ నెలకొన్న విషయం విదితమే. రాజకీయాల నేపథ్యంలో ఆయన చేస్తోన్న 'నోటా' విషయంలో కూడా అంతా ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. అందుకే జగన్ పాత్రకు విజయ్ దేవరకొండను తీసుకోవడం మంచిదనే ఉద్దేశంతో సంప్రదింపులు మొదలైనట్టు సమాచారం. వై ఎస్ జగన్ పాత్రకి విజయ్ దేవరకొండ కరెక్టుగా సూట్ అవుతాడనే బలమైన నమ్మకం ఈ సినిమా టీంలో ఏర్పడిందట. ఈ నేపధ్యంలోనే విజయ్ దేవరకొండను జగన్ పాత్రకు ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో వాస్తవమెంతన్నది త్వరలోనే వెల్లడికానుంది.