సినిమా వార్తలు

‘యాత్ర’ ప్రీరిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథిగా జననేత


8 months ago ‘యాత్ర’ ప్రీరిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథిగా జననేత

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రగా 'యాత్ర' సినిమా రూపొందింది. మహి.వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ఫిబ్రవరి 8వ తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ కి అనూహ్యమైన స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వైజాగ్ లో నిర్వహించాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారని సమాచారం. ఈ వేడుకకి వైఎస్ జగన్ చీఫ్ గెస్ట్ గా రానున్నట్టు తెలుస్తోంది. వైఎస్ జగన్ తో పాటు ఆయన తల్లి విజయమ్మ, భార్య భారతి ఇతర కుటుంబ సభ్యులు ఈ వేడుకకి హాజరు కానున్నట్టు భోగట్టా. గతంలో వైఎస్ చేపట్టిన పాదయాత్ర, ప్రజలకు ఆయన మరింత దగ్గరైన సంఘటనలు, ఆనాటి రాజకీయాలపై ఆయన పాదయాత్ర చూపిన ప్రభావం ఈ బయోపిక్ లో చూపించనున్నారు. వైఎస్ గా మమ్ముట్టి, విజయమ్మగా ఆశ్రిత వేముగంటి నటించిన ఈ బయోపిక్ కి రానురాను అంచనాలు పెరుగుతున్నాయి.