సినిమా వార్తలు

క్రిస్మ‌స్ వేళ... చిరు ఇంటికి బుజ్జి అతిథి


9 months ago క్రిస్మ‌స్ వేళ... చిరు ఇంటికి బుజ్జి అతిథి

క్రిస్మ‌స్ పండుగా మెగా ఫ్యామిలీకి బోలెడంత సంబరాన్ని మోసుకొచ్చింది. మెగాస్టార్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ‌, క‌ల్యాణ్ దేవ్ దంప‌తుల‌కు ఆడ శిశువు జ‌న్మించింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా క‌ల్యాణ్ దేవ్ ఈ విష‌యాన్ని అభిమానుల‌తో షేర్ చేసుకున్నారు. పాప కాలిముద్ర ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. `ఈ ఏడాది క్రిస్మ‌స్ నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది. మాకు పండంటి పాప‌ జ‌న్మించింది. అంద‌రికీ క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు` అంటూ క‌ల్యాణ్ దేవ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. `విజేత‌` సినిమాతో తెలుగు తెరంగేట్రం చేసిన కల్యాణ్ దేవ్ ప్ర‌స్తుతం త‌న రెండో సినిమా ప‌నుల‌తో బిజీగా గడుపుతున్నారు.