సినిమా వార్తలు

రామ్ సినిమాలో అదిరిపోయే ఐటమ్ నంబర్


7 months ago రామ్ సినిమాలో అదిరిపోయే ఐటమ్ నంబర్

రామ్ కథానాయకుడుగా పూరి జగన్నాథ్ 'ఇస్మార్ట్ శంకర్' సినిమాను రూపొందిస్తున్నవిషయం విదితమే. ఈ సినిమాలో రామ్ రఫ్ లుక్ తో కనిపిస్తూ .. మాస్ ఆడియన్స్ లో ఆసక్తిని రేకేత్తిస్తున్నాడు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, చకచకా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. గతంలో పూరి - మణిశర్మ కాంబినేషన్లో వచ్చిన 'పోకిరి' సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ సినిమాలో 'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే .. 'అంటూ సాగిన ఐటమ్ సాంగ్ ఇప్పటికీ కుర్రాళ్ల గుండెల్లో వినిపిస్తూనే ఉంటుంది. ఆ ఐటమ్ సాంగ్ కి మించిన ట్యూన్ చేయమని పూరి చెప్పడంతో .. మణిశర్మ ఆ పనిని నెరవేర్చారని అంటున్నారు. త్వరలోనే 'నోరా ఫతేహి'పై ఈ ఐటమ్ సాంగ్ ను చిత్రీకరించనున్నట్టు భోగట్టా.