సినిమా వార్తలు

‘మిస్టర్ మజ్ను’ఆ సినిమా కాపీనట?


1 year ago ‘మిస్టర్ మజ్ను’ఆ సినిమా కాపీనట?

ఒక సినిమా స్టోరీ లైన్ ను, లేదా సినిమాను ఇన్ స్పిరేషన్ తీసుకోవడం అనేది సాధారణంగా జరుగుతుంటుంది. ఆ విషయం బయటకు చెప్పినా మామూలు విషయంగానే కనిపిస్తుంది. తాజాగా అఖిల్ న్యూ ప్రాజెక్టు విషయంలోనూ ఫిలిం సర్కిల్స్ లో అలాంటి చర్చే జరుగుతోంది. అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘మిస్టర్ మజ్ను’ సినిమాను బాలీవుడ్ ‘బచ్నా ఏ హసీనో’ అనే మూవీ నుంచి కాపీకొట్టేశారనే వార్త సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. రణ్ బీర్ కపూర్, దీపికా పదుకొనె, బిపాసా బసు నటించిన ఈ రొమాంటిక్ డ్రామాను కొంచెం అటు ఇటు మార్చి ‘మిస్టర్ మజ్ను’ స్టోరీని రెడీ చేశారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పటికే రెండు సినిమాలతో యావరేజ్ మార్కులు కూడా దక్కించుకోలేకపోయినపోయిన అఖిల్. ఈసారి కాపీ కొట్టి అయినా పాస్ అవుతాడా అని సినీజనాలు సెటైర్లు వేస్తున్నారట. అయితే ఈ కాపీ వార్తల్లో నిజం లేదని చిత్రయూనిట్ చెబుతోంది. ఏ సినిమా నుంచి ‘మిస్టర్ మజ్ను’ స్టోరీని కాపీ పేస్ట్ చేయలేదని, ఇది హండ్రెడ్ పర్సంట్ జెన్యూన్ రొమాంటిక్ లవ్ స్టోరీ అని చెపుతున్నారు. మరోవైపు డెబ్యూ మూవీ ‘అఖిల్’తో సోషియో ఫాంటసీ ట్రై చేసి షాక్ తిన్న హీరో అఖిల్ రెండో ప్రయత్నంగా డిస్టెనీ పేరిట ‘హలో’ మూవీ చేసి డిఫెన్స్ లో పడ్డాడు. దీంతో తన కెరీర్ లో మూడో సినిమాగా తెరకెక్కుతున్న ‘మిస్టర్ మజ్ను’పైనే ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఇప్పుడు ఇది కూడా కాపీ అని రూమర్స్ రావడంతో అక్కినేని హీరోలను ఈ విషయం తెగ టెన్షన్ కు గురిచేస్తోందట. మరి ఈ వార్తల్లో ఎంతవరకూ నిజం ఉందో తెలుసుకోవాలంటే సినిమా విడుదలయ్యేదాక వేచిచూడాల్సిందే.