సినిమా వార్తలు

అదే రజనీ చివరి సినిమా?


1 year ago అదే రజనీ చివరి సినిమా?

శంకర్ తో '2.ఓ' చేసిన రజనీకాంత్ ఆ తరువాత స్పీడ్ పెంచేశాడు. 'కబాలి' .. 'కాలా' సినిమాలు చకచకా కానిచ్చేశాడు. ప్రస్తుతం ఆయన హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. రీసెంట్ గా ఈ సినిమాకి 'పేట' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా తరువాత రజనీకాంత్ .. మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టు సమాచారం. ఇది రజనీకాంత్ కి 166వ సినిమా ... ఈ మూవీ తరువాత ఇక రజనీ సినిమాలు చేయరనే టాక్ వినిపిస్తోంది.

పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయించాలని ఆయన నిర్ణయించుకోవడమే అందుకు కారణం. ప్రస్తుతం మురుగదాస్ .. విజయ్ హీరోగా 'సర్కార్' సినిమా చేస్తున్నాడు. 'దీపావళి'కి ఈ సినిమా విడుదల కానుంది. జనవరి నుంచి రజనీ ప్రాజెక్టుతో సెట్స్ పైకి వెళ్లనున్నాడు. రాజకీయాల నేపథ్యంలోనే ఈ సినిమా కొనసాగుతుందని చెప్పుకుంటున్నారు.