సినిమా వార్తలు

అరవింద సమేత'లో మరో హుషారైన సాంగ్?


1 year ago అరవింద సమేత'లో మరో హుషారైన సాంగ్?

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా రూపొందుతున్న విషయం విదితమే. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా అక్టోబర్ 11వ తేదీన విడుదల కానుంది. రీసెంట్ గా ఈ సినిమాలోని నాలుగు పాటలను నేరుగా మార్కెట్లోకి రిలీజ్ చేశారు. ఈ పాటల్లో 'రెడ్డి ఇక్కడ సూడు' పాట ఒక్కటి మాత్రమే కాస్త జోరుగా హుషారుగా సాగుతోంది. ఎన్టీఆర్ సినిమా అంటేనే ఆయన నుంచి ఒక రేంజ్ స్టెప్పులను .. అందుకు అవకాశం కలిగించే పాటలను అభిమానులు ఆశిస్తారు.

అలాంటి పాట ఈ సినిమాలో ఒక్కటి మాత్రమే ఉండటంతో, సోషల్ మీడియా ద్వారా వాళ్లు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ మరో పాట ట్యూన్ చేయించే వుందట. అయితే సమయం లేని కారణంగా ఇక వద్దులే అని త్రివిక్రమ్ అనుకున్నారట. కానీ అభిమానులు వ్యక్తం చేస్తోన్న అసంతృప్తి అధికంగా ఉండటంతో , మరో పాటకు కూడా సినిమాలో చోటు కల్పించాలనే నిర్ణయానికి ఆయన వచ్చేసినట్టుగా ఒక టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. మరి ఆ పాటని కూడా చూద్దాం ఎంజాయ్ చేద్దాం.