సినిమా వార్తలు

ఆసక్తికరంగా నాగచైతన్య 'సవ్యసాచి' ట్రైలర్


11 months ago ఆసక్తికరంగా నాగచైతన్య 'సవ్యసాచి' ట్రైలర్

నాగచైతన్య కథానాయకుడిగా చందూ మొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి' సినిమా రూపొందించారు. ప్రతినాయకుడిగా మాధవన్ నటించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ను రూపొందించారు. లవ్, కామెడీ, ఎమోషన్, యాక్షన్ సీన్స్ తో రూపొందించిన ఈ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తించేదిలా ఉందనే టాక్ తెచ్చుకుంది."వాణ్ని చూస్తుంటే పద్మవ్యూహంలో అభిమాన్యుడిలా ఉన్నాడు కదూ .. " అని  హీరోను ఉద్దేశించి ప్రతినాయకుడు పక్కనే వున్న వ్యక్తితో అంటే, 'మీది పద్మవ్యూహమే సార్ .. కానీ ఆయన అభిమన్యుడిలా కాదు .. అర్జునుడులా వున్నాడు' అని ఆయన పలికించే డైలాగ్ బాగా పేలింది. 'చావైనా నిన్ను చేరాలంటే అది నీ ఎడమ చేయి దాటి రావాలి' అంటూ రావు రమేశ్ చెప్పిన డైలాగ్ విపరీతంగా ఆకట్టుకునే విధంగా వుంది. ఈ సినిమాలో చైతూ అక్కగా నటి భూమిక కీలకమైన పాత్ర పోషిస్తున్నారు.