సినిమా వార్తలు

ఆసక్తికరంగా ‘మజిలీ’ టీజర్


7 months ago ఆసక్తికరంగా ‘మజిలీ’ టీజర్

నాగచైతన్య,  సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో 'మజిలీ' సినిమా రూపొందుతోంది. ఒక విభిన్నమైన ప్రేమకథాంశంతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దివ్యాన్శక్ మరో కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ ను విడుదల చేశారు. క్రికెట్ లో చైతూ రాణిస్తుండటం, ఆయన దివ్యాన్శక్ ప్రేమలో పడటం, భార్య సమంతను దూరం పెట్టడం ఈ టీజర్లో చూపించారు. 'ఒక్కసారి పోతే తిరిగిరాదురా .. అది వస్తువైనా .. మనిషైనా ..' అనే రావు రమేశ్ డైలాగ్ .. 'నువ్వు నా రూము లోపలికి రాగలవేమో గానీ, నా మనసులోకి ఎప్పటికీ రాలేవు' అనే చైతూ డైలాగ్ .. 'వెధవలకెప్పుడూ మంచి పెళ్లాలు దొరుకుతారని నువ్వే ప్రూవ్ చేశావ్' అనే పోసాని డైలాగ్ ఆకట్టుకునేలా వున్నాయి. చైతూ క్లాస్ లుక్ తోను .. మాస్ లుక్ తోను కనిపిస్తున్నాడు. ఆయన ప్రియురాలిగా దివ్యాన్శక్ .. భార్యగా సమంత నటించారు. లవ్,యాక్షన్, ఎమోషన్ సీన్స్ పై కట్ చేసిన ఈ టీజర్  సినిమాపై మరింత ఆసక్తిని పెంచేదిలా వుంది.