సినిమా వార్తలు

ఆసక్తి కలిగిస్తున్న‘అంతరిక్షం 9000 కెఎమ్‌పిహెచ్’


9 months ago ఆసక్తి కలిగిస్తున్న‘అంతరిక్షం 9000 కెఎమ్‌పిహెచ్’

వరుణ్ తేజ్ కథానాయకుడిగా, లావణ్య త్రిపాఠి, అదితిరావు హైదరి హీరోయిన్లుగా ‘ఘాజి’ ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘అంతరిక్షం 9000 కెఎమ్‌పిహెచ్’. ఈ చిత్రాన్ని దర్శకుడు జాగర్లమూడి క్రిష్, సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి‌ నిర్మిస్తున్నారు. చిత్రానికి ప్రశాంత్ విహారి సంగీతం సమకూరుస్తుండగా జ్ఞాన శేఖర్ విఎస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. తెలుగులో తొలి స్పేస్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేశాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ భారీ అంచనాలను తెచ్చిపెట్టింది. ట్రైలర్ చూస్తుంటే.. అద్భుతమైన విజువల్ వండర్‌గా ‘అంతరిక్షం’ ఉండబోతుందని స్పష్టంగా తెలుస్తోంది. మిరా అనే శాటిలైట్‌ దారి తప్పిన నేపధ్యంలో ఒక్కసారిగా ప్రపంచంలోని కమ్యూనికేషన్ వ్యవస్థలన్నీ కుప్పకూలే పరిస్థితి ఏర్పడతాయి. ఆ ప్రమాదం నుంచి బయటపడేలా ఆఫీసర్‌ దేవ్‌(వరుణ్ తేజ్) చేసిన సాహసమే ఈ సినిమా కథ అని సమాచారం. ఇప్పటివరకు తెలుగులో ఈ తరహా సినిమా రాలేదని ట్రైలర్ ద్వారా వెల్లడైంది. ‘ప్రపంచం మొత్తం కమ్యూనికేషన్ బ్లాకౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయ్’, ‘ప్రయత్నించకుండా ఓడిపోవటం కన్నా ఎక్కువ అవమానం ఉండదు’ లాంటి డైలాగ్స్ చిత్రానికి ప్రాణం పోశాయని అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 21న ఈ సినిమా విడుదల కానుంది.