సినిమా వార్తలు

ఆక‌ట్టుకుంటున్న‘హ‌లో గురు ప్రేమ కోస‌మే’ టీజ‌ర్‌


1 year ago ఆక‌ట్టుకుంటున్న‘హ‌లో గురు ప్రేమ కోస‌మే’ టీజ‌ర్‌

సాధార‌ణంగా టీజ‌ర్‌, ట్రైల‌ర్  ఆ సినిమాలోని బిట్లు అక్క‌డ‌క్క‌డ క‌ట్ చేసి క‌థ ఇది అని సూక్ష్మంగా చెప్పి వ‌దిలేస్తారు. ఈ సంప్ర‌దాయాన్ని కాస్త బ్రేక్ చేసింది `హ‌లో గురు ప్రేమ కోస‌మే` టీజ‌ర్‌. రామ్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా న‌టించిన చిత్ర‌మిది. దిల్‌రాజు నిర్మాత‌. త్రినాధ‌రావు న‌క్కిన ద‌ర్శ‌కత్వం వ‌హించారు. టీజ‌ర్ విడుద‌లైంది. త‌ల‌స్నానం చేసి, సాంబ్రాణి పొగ‌ల మ‌ధ్య త‌ల ఆరేసుకుంటున్న హీరోయిన్‌… చాటుగా న‌డుముని చూస్తూ.. రొమాంటిక్ ఫీల్‌లోకి వెళ్లిపోయిన హీరో.. వాళ్లిద్ద‌రి మ‌ధ్య సాగిన స‌ర‌దా సంభాష‌ణ‌… ఇంతే! కాక‌పోతే… ఈ టీజ‌ర్ చూస్తే. సినిమా రొమాంటిక్‌గా ఉంటుంద‌న్న‌ విష‌యం అర్థ‌మ‌వుతోంది. ల‌వ్‌, రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ల‌కు మంచి రోజులొచ్చాయి. 

ముచ్చటైన చూడ చక్కని జంటగా రామ్ , అనుపమ ఇట్టే ఆకట్టుకున్నారు. ఈ మచ్చుతునకే ఇంత అందంగా ఉంటె ఇక సినిమా మొత్తం చక్కని పెయింటింగ్ లా ఉంటుందా అని అందరు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.