సినిమా వార్తలు

ఆకట్టుకుంటున్న 'కవచం' పాట


10 months ago ఆకట్టుకుంటున్న 'కవచం' పాట

శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వంలో రూపొందిన 'కవచం' సినిమా ఈ నెల 7వ తేదీన విడుదల కానుంది. బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్, మెహ్రీన్ ప్రధాన పాత్రలను పోషించిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక సాంగ్ ను విడుదల చేశారు. "నా అడుగే పడితే అణుయుద్ధం .. మొదలవుతుంది అనునిత్యం .. అని అనవసరంగా బిల్డప్ ఇవ్వను బ్రో. నే చిటికే వేస్తే భూగోళం .. వెళ్లిపోతుంది పాతాళం .. అని ఎక్కడ లేని బిల్డప్ ఇవ్వను బ్రో .." అంటూ ఈ పాట అలరించేలావుంది. తన స్వభావం గురించి హీరో చెప్పుకునే ఇంట్రడక్షన్ సాంగ్ ఇది అని తెలుస్తోంది. బ్యూటిఫుల్ లొకేషన్స్ లో  ఈ సాంగ్ ను చిత్రీకరించారు. తమన్ స్వరపరిచిన ఈ పాట యూత్ ను ఆకట్టుకుంటోంది. బెల్లంకొండ శ్రీనివాస్ యాక్షన్ .. కాజల్ గ్లామర్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయనే టాక్ వినిపిస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ ఆశిస్తోన్న విజయం ఈ సినిమాతోనైనా దక్కుతుందేమో చూడాలి.