సినిమా వార్తలు

అలరించేలా 'హలో గురూ ప్రేమకోసమే' ఫస్టు సింగిల్


1 year ago అలరించేలా 'హలో గురూ ప్రేమకోసమే' ఫస్టు సింగిల్

రామ్ క‌థానాయ‌కునిగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో 'హలో గురు ప్రేమకోసమే' చిత్రం రూపొందింది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమాను అక్టోబర్ 18వ తేదీన విడుదల చేయనున్నారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేశారు. "దూరం దూరం దూరం దూరంగుండే ఆకాశం .. దగ్గరకొచ్చి గారం చేసిందా .., భారం భారం భారం భారం అనుకోకుండా నాతోపాటు భూమిని లాగిందా .. "అంటూ ఈ పాట కొనసాగింది. ఓ కుర్రాడి మనసులో ప్రేమ పుట్టినప్పుడు చోటుచేసుకునే సంతోషంలో నుంచి పుట్టినపాటగా ఇది సాగుతోంది. దేవిశ్రీ సంగీతం .. శ్రీమణి సాహిత్యం .. అల్ఫాన్స్ జోసెఫ్ ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. ఈ పాటలో రామ్ గతంలో కంటే హ్యాండ్సమ్ గా కనిపిస్తూ ఉండగా, అనుపమ మరింత గ్లామరస్ గా అనిపిస్తోంది. కొంతకాలంగా వరుస పరాజయాలతో రామ్ సతమతమైపోతున్నాడు. దాంతో ఆయన ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. ఆయన ఆశిస్తోన్న హిట్ ఈ సినిమాతో లభిస్తుందేమో చూడాలి.