సినిమా వార్తలు

‘సైనా నెహ్వాల్' ఫస్టులుక్ అదుర్స్


11 months ago ‘సైనా నెహ్వాల్' ఫస్టులుక్ అదుర్స్

బ్యాడ్మింటన్ క్రీడలో సైనా నెహ్వాల్  ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఆత్మస్థైర్యంతో ఎన్నో విజయాలను సొంతం చేసుకుంటూ  స్ఫూర్తిగా నిలుస్తోంది. అందుకే ఆమె జీవితచరిత్రను అభిమానుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. శ్రద్ధా కపూర్ టైటిల్ రోల్ చేస్తోన్న ఈ సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. తాజాగా ఈ సినిమా నుంచి శ్రద్ధా కపూర్ ఫస్టులుక్ ను విడుదల చేశారు. ఈ సినిమా సెట్స్ పైకి రావడానికి ముందే ఫిట్ నెస్ కోసం శ్రద్ధా కపూర్ మరింతగా కసరత్తు చేసింది. అందుకే ఫస్టులుక్ లో శ్రద్ధా కపూర్ మంచి ఫిట్ నెస్ తో కనిపిస్తోంది. రీసెంట్ గా శ్రద్ధా కపూర్ చేసిన 'స్త్రీ' భారీ వసూళ్లను సాధించడంతోపాటు నటన పరంగా శ్రద్ధా కపూర్ కి మంచి పేరు తెచ్చింది. అలాగే ఈ బయోపిక్ కూడా తనకి మరింత క్రేజ్ ను తీసుకొస్తుందనే నమ్మకంతో శ్రద్ధ వుంది.