సినిమా వార్తలు

ఆ రివ్యూలను చూసి బాధపడ్డాను: శ్రీకాంత్


10 months ago ఆ రివ్యూలను చూసి బాధపడ్డాను: శ్రీకాంత్

ఈ మధ్యకాలంలో తాను నటించిన చిత్రాల్లో తనకు సంతృప్తిని ఇచ్చిన చిత్రం 'ఆపరేషన్ 2019' అని, అయితే ఈ చిత్రంపై వచ్చిన రివ్యూలను చూసి చాలా బాధపడ్డానని నటుడు శ్రీకాంత్ వ్యాఖ్యానించారు. శ్రీకాంత్ హీరోగా, కరణం బాబ్జీ దర్శకత్వంలో రూపొందిన 'ఆపరేషన్‌ 2019' విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్‌ లో జరిగింది. ఈ సందర్బంగా శ్రీకాంత్ మాట్లాడుతూ, అభిమానులు చిత్రాన్ని ఆదరిస్తున్నారని, కలెక్షన్లు బాగున్నాయని అన్నారు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు ఆనందంగా ఉన్నారన్నారు. అయితే విమర్శకుల అభిప్రాయాలను తాను గౌరవిస్తానని, ఇదే సమయంలో రివ్యూలు రాసేవాళ్లు కూడా కాస్త ఆలోచించి రాయాలన్నారు. ఒక సినిమా బాగా ఆడితే, పరిశ్రమలో మరో పది మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.