సినిమా వార్తలు

నాకూ వేధింపులు తప్పలేదు: మంచు లక్ష్మి


11 months ago నాకూ వేధింపులు తప్పలేదు: మంచు లక్ష్మి

సినీ నటి మంచు లక్ష్మి తాను కూడా లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో వేధింపులను ఎదుర్కోలేదని, నిజ జీవితంలో ఎదుర్కొన్నానని చెప్పింది. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు బదులుగా ఆమె ఈ విషయాన్ని తెలిపింది. మరోవైపు 'మేము సైతం' అనే టీవీ కార్యక్రమాన్ని మంచు లక్ష్మి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో 'పవన్ కల్యాణ్ ను ఈ కార్యక్రమానికి తీసుకురావచ్చు కదా?' అని ఓ నెటిజన్ అడిగాడు. దీనికి సమాధానంగా 'కార్యక్రమానికి రావాలని పవన్ కల్యాణ్ ను చాలా సార్లు అడిగాను. ఇంకా ఆయన నుంచి సమాధానం రాలేదు' అని తెలిపింది. 

ఎయిర్ ఇండియాపై ఆగ్రహం

ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాపై నటి మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి కారణం చెప్పకుండా దాదాపు 4 గంటల పాటు తనను క్యూలైన్ లో నిలబెట్టారని వెల్లడించారు. ఈ మేరకు ఆమె వరుస ట్వీట్లు చేశారు. ప్రయాణికులను ఎయిర్ ఇండియా అధికారులు కనీసం పట్టించుకోలేదన్నారు. దీంతో ఆహారం, నీళ్లు లేకుండా పలువురు ప్రయాణికులు పుణె ఎయిర్ పోర్టులో చిక్కుకున్నారన్నారు. తాము గట్టిగా నిలదీస్తే అక్కడి ఎయిర్ ఇండియా అధికారి జవాబు చెప్పకుండా తప్పించుకున్నాడని పేర్కొంది. చివరికి తాను హైదరాబాద్ కు ఫోన్ చేస్తే వాతావరణం బాగోలేని కారణంగానే విమానం రద్దయినట్లు తెలిసిందని మంచు లక్ష్మి తెలిపారు. 'ప్రయాణికులను అంత టార్చర్ పెట్టడంలో ఎయిర్ ఇండియాలో అంత ఆనందం ఎందుకుందో!' అని ఆమె విమర్శించారు.