సినిమా వార్తలు

అంచ‌నాలు పెంచేసిన యాత్ర ట్రైల‌ర్‌


8 months ago అంచ‌నాలు పెంచేసిన యాత్ర ట్రైల‌ర్‌

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'యాత్ర' సినిమాపై భారీ అంచనాలు ఏర్ప‌డ్డాయి. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను యూనిట్ సభ్యులు విడుదల చేశారు. రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఉన్న సన్నివేశాలు, డైలాగ్ లు విప‌రీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సమాజంలో అన్నింటికన్నా పెద్ద జబ్బు పేదరికం అనే డైలాగ్ జనాల మనసులను తాకేలా ఉంది. ఫిబ్రవరి 8న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రను మమ్ముట్టి పోషించగా జగపతిబాబు, సుహాసిని, సుధీర్ బాబు, రావు రమేష్ తదితరులు నటించారు.