సినిమా వార్తలు

'వినయ విధేయ రామ' సెకండ్ సింగిల్ అదుర్స్‌!


9 months ago 'వినయ విధేయ రామ' సెకండ్ సింగిల్ అదుర్స్‌!

రామ్ చరణ్ హీరోగా 'వినయ విధేయ రామ' రూపొందుతోంది. గ్రామీణ నేపథ్యంలో .. కుటుంబంలోని బంధాలు .. అనుబంధాలు ప్రధానంగా ఈ చిత్రం నిర్మిత‌మ‌వుతోంది. యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కి పెద్దపీట వేస్తూ దర్శకుడు బోయపాటి ఈ సినిమా రూపొందించారు. ఇటీవల రిలీజ్ చేసిన‌ ఫస్టు సింగిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో తాజాగా రెండవ సింగిల్ ను రిలీజ్ చేశారు. "రోమియో జూలియట్ మళ్లీ పుట్టినట్టు ఉంటదంటా మన జట్టు .. వాళ్ల కథలో క్లైమాక్స్ పాజిటివ్ గా రాసినట్టు .. మన లవ్ స్టోరీ హిట్టు .." అంటూ దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాట అంద‌రినీ అల‌రిస్తోంది. 'మోనలిసా నవ్వు .. సన్నజాజి పువ్వు ఒక్కటైతే నువ్వు' .. 'వేడివేడి లావా స్వీటు పాలకోవ ఒక్కటైతే నువ్వు' అనే పదప్రయోగాలు అద్భుత‌మంటున్నారు. శ్రీమణి సాహిత్యం .. జస్ ప్రీత్ .. మనసి ఆలాపన  ఆకట్టుకుంటోంది. స్నేహా .. ప్రశాంత్ ఈ సినిమాలో కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను మెప్పించేలా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.