సినిమా వార్తలు

లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ కు బ్రహ్మరథం


7 months ago లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ కు బ్రహ్మరథం

ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ  ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ట్రైలర్ ను విడుదల చేసిన సంగతి విదితమే. ఇది విడుదలైన కొద్ది వ్యవధిలోనే యూట్యూబ్ లో వీక్షించిన వారి సంఖ్య ఏకంగా 15,89,177కు చేరుకుంది. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రతిపక్ష నేత జగన్, కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ఫొటోలతో కూడిన ఫన్నీ మెమెలను ట్విట్టర్ లో పోస్ట్ చేసి మరో సంచలనానికి తెరలేపారు. జగన్ పాదయాత్రలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ ను చూస్తున్నట్లు మెమెను పోస్ట్ చేసిన వర్మ..‘జగన్ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ ను చూస్తున్నంత సీరియస్ గా ఇటీవలికాలంలో దేనినీ చూడలేదు’ అంటూ ట్వీట్ చేశారు. అలాగే రాహుల్ గాంధీ మెమెను పోస్ట్ చేసి..‘టీడీపీతో పొత్తుపై రెండో ఆలోచనలు ఉన్నాయా?’ అని వ్యంగ్య వ్యాఖ్యానం రాశారు.