సినిమా వార్తలు

విజిల్ వేయిస్తున్న 'పెట్టా' టీజర్


9 months ago విజిల్ వేయిస్తున్న 'పెట్టా' టీజర్

రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజు 'పెట్టా' సినిమాను రూపొందించాడు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. డిసెంబరు12 రజనీకాంత్ పుట్టినరోజు కావడంతో, అభిమానులలో సంతోషాన్ని రేకెత్తించేందుకు 'పెట్టా' సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు. 'పెట్టా' టీమ్ రజనీకి శుభాకాంక్షలు చెబుతూ ఈ టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్లో రజనీ మోడ్రన్ లుక్ లో, సంప్రదాయ దుస్తుల్లోను డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తున్నారు. యూత్ తో కలిసి ఆయన స్టెప్పులు వేయడం, అందరూ విందు ఆరగిస్తూ ఆయనను ఆశీర్వదించడం లాంటి దృశ్యాలతో ఈ టీజర్ ను కట్ చేశారు. ఈ సినిమాలో సిమ్రాన్ .. త్రిష కథానాయికలు.