సినిమా వార్తలు

ఆస‌క్తిక‌రంగా 'మహానాయకుడు' ట్రైలర్


7 months ago ఆస‌క్తిక‌రంగా 'మహానాయకుడు' ట్రైలర్

ఎన్టీఆర్ బయోపిక్ లో రెండవ పార్ట్ 'మహానాయకుడు' కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ రాజకీయరంగ ప్రవేశం నుంచి, ఒక మహానాయకుడిగా ఎదిగిన తీరును ఈ భాగంలో చూపించనున్నార‌ని సమాచారం. ఈ నెల 22వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా  ట్రైలర్ ను విడుద‌ల చేశారు. రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ ప్రజల్లోకి వెళ్లడం, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు, ఢిల్లీ రాజకీయాలను ఎదిరించిన తీరు, బసవతారకం అనారోగ్యానికి గురికావడం, ఇలా ఆయనను కదిలించిన సంఘటనలు, కలచివేసిన సన్నివేశాలు దీనిలో చూపించారు. "నిశ్శబ్దాన్ని చేతగానితనం అనుకోవద్దు, మౌనం మారణాయుధంతో సమానమని మరిచిపోకు' అంటూ 'మహానాయకుడు' చెప్పిన డైలాగ్ బాగుంద‌నే టాక్ వినిపిస్తోంది.  ఈ ట్రైలర్ .. సినిమాపై అంచనాలు పెంచేలా క‌నిపిస్తోంది. 'కథానాయకుడు' ఫలితం నిరాశపరచడంతో నందమూరి అభిమానులంతా 'మహానాయకుడుపై విప‌రీత‌మైన ఆశలు పెట్టుకున్నారు.