సినిమా వార్తలు

దుమ్మురేపుతూ దూసుకుపోతున్న ‘కేజీఎఫ్’


8 months ago దుమ్మురేపుతూ దూసుకుపోతున్న ‘కేజీఎఫ్’

కన్నడలో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ‘కేజీఎఫ్’ విడుదలైన అన్ని భాషల్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలై నెల రోజులు అవుతున్నా ఇప్పటికీ హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతుండటం విశేషం. తాజాగా ‘కేజీఎఫ్’ సినిమా కర్ణాటకలో మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలైన ‘కేజీఎఫ్’..హిందీలో రూ.50 కోట్లను వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. పీరియాడియల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో రూ.25 కోట్ల షేర్ పొందింది. ఇప్పటి వరకు కర్ణాటకలో ప్రభాస్ హీరోగా నటించిన ‘బాహుబలి 2’ సినిమా రూ.129 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో నెంబర్ వన్ ప్లేస్‌లో ఉంది. ఇపుడు ఈ రికార్డును ‘కేజీఎఫ్’ సినిమా త్వరలో క్రాస్ చేయనుందని తెలుస్తోంది.

ఇప్పటి వరకు కర్ణాటకలో ‘కేజీఎఫ్’ సినిమా రూ. 121 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.  అంతేకాదు  పాకిస్థాన్‌లో కూడా ‘కేజీఎఫ్’ రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ను రాబడుతుంది. ఓవరాల్‌గా ఇప్పటి వరకు ఈ సినిమా రూ. 219.99 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దక్కించుకుంది.  కాగా త్వరలో ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ అంటూ ఈ సినిమా రెండో భాగం రూపొందనుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌తో పాటు రమ్యకృష్ణ వంటి నటీనటులు నటించే అవకాశాలున్నాయని సమాచారం. మొత్తానికి దక్షిణాది చిత్రాలు ఉత్తారాదిలో చిత్రాలతో పోటీపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు.