సినిమా వార్తలు

అలరిస్తున్న 'కవచం'సాంగ్


10 months ago అలరిస్తున్న 'కవచం'సాంగ్

బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వంలో 'కవచం' సినిమా రూపొందుతోంది. కాజల్ కథానాయికగా నటించిన ఈ సినిమా నుంచి తాజాగా ఫస్టు సాంగ్ వీడియోను విడుదల చేశారు. "ప్రేమను మించిన ప్రేమేలేదని మనసును ప్రశ్నించాను .. ఊపిరి మించిన శ్వాసే లేదని గాలిని ప్రశ్నించాను" అంటూ ఈ పాట వినవస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ .. కాజల్ పై అందమైన .. అద్భుతమైన లొకేషన్స్ లో ఈ పాటను చిత్రీకరించారు. తమన్ స్వరపరించిన ఈ మెలోడీ సాంగ్ కొత్తగా అలరించేలా ఉంది. నీల్ నితిన్ ముఖేశ్ ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమాలో, మరో కథానాయికగా మెహ్రీన్ కనిపించనుంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా తనకి తప్పకుండా సక్సెస్ ను ఇస్తుందనే నమ్మకంతో బెల్లంకొండ శ్రీనివాస్ ఉన్నాడు.