సినిమా వార్తలు

తెగనవ్విస్తున్న'ఎఫ్ 2' టీజర్


9 months ago తెగనవ్విస్తున్న'ఎఫ్ 2' టీజర్

అనిల్ రావిపూడి సినిమాల్లో కామెడీకి అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. మరోసారి కామెడీనే ప్రధానంగా ఆయన 'ఎఫ్ 2' సినిమాను చేశారు. వెంకటేశ్, తమన్నా, వరుణ్ తేజ్, మెహ్రీన్ జంటగా నటించిన ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని సమాచారం. డిసెంబరు 13న వెంకటేశ్ పుట్టినరోజు కావడంతో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ .. కామెడీ సీన్స్ పైనే ఈ టీజర్ ను కట్ చేశారు. "ఒక చరిత్ర గురించి చెప్పాలంటే క్రీస్తు పూర్వం .. క్రీస్తు శకం అంటాం. ఒక మగాడి గురించి చెప్పాలంటే పెళ్లికి ముందు .. పెళ్లికి తరువాత" అంటూ వెంకీ చెప్పిన ఫన్నీ డైలాగ్ తో టీజర్ స్టార్ట్ అవుతోంది. కంటెంట్ ఏమిటనేది చెప్పడానికి ఈ ఒక్క డైలాగ్ సరిపోతుంది. రఘుబాబు చెబుతున్నా వినిపించుకోకుండా వెంకీ పెళ్లి చేసుకుని కష్టాలు పడటం .. వెంకీ చెబుతున్నా వినిపించుకోకుండా వరుణ్ తేజ్ పెళ్లి చేసుకుని తంటాలు పడటం చాలా ఫన్నీగా చిత్రించారు.