సినిమా వార్తలు

ఓవర్సీస్ 'యాత్ర' కు భారీ డిమాండ్


10 months ago ఓవర్సీస్ 'యాత్ర' కు భారీ డిమాండ్

ఉమ్మడి ఆంధ్రపదేశ్ సీంఎంగా తెలుగు ప్రజలపై చెరగని ముద్ర వేసిన దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం ఆధారంగా 'యాత్ర' తెరకెక్కుతోంది.  ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇతర ప్రమోలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.  ట్రేడ్ వర్గాల్లో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ను ఒక ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ రూ. 4 కోట్లకు తీసుకుందని సమాచారం.  ప్రముఖ తెలుగు హీరో లు ఎవరూ సినిమాలో లేకున్నా ఈ రేటు పలికిందంటే దానికి సినిమా పై ఉన్న మంచి బజ్ కారణమని చెబుతున్నారు.  ఈ సినిమాలో వైఎస్ పాదయాత్ర చేయడం మొదలు పెట్టిన నాటి నుండి సీఎమ్ గా ప్రమాణ స్వీకారం చెసే రోజు వరకూ జరిగిన సంఘటనలను ప్రముఖంగా చూపిస్తారట. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో నటిస్తున్నారు. 'ఆనందో బ్రహ్మ' ఫేమ్ మహి వి. రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను విజయ్ చిల్లా - శశి దేవిరెడ్డి నిర్మాణ బాధ్యతలు వహిస్తున్నారు.  ఈ సినిమాను డిసెంబర్ 21 న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది