సినిమా వార్తలు

అనుష్క పక్కన హాలీవుడ్ స్టార్?


8 months ago అనుష్క పక్కన హాలీవుడ్ స్టార్?

హీరోను తలచుకుంటూ పాటలు పాడుకునే పాత్రలను అనుష్క పక్కన పెట్టేసి చాలా కాలం గడిచింది. హీరోతో సమానంగా సక్సెస్ వైపు నడిపించగల సామర్థ్యం తనకు ఉందని ఆమె 'అరుంధతి' సినిమాతోనే నిరూపించింది. తాజాగా అనుష్క 'భాగమతి' తరువాత కథానాయిక ప్రాధాన్యత కలిగిన ఒక సినిమా చేయడానికి అంగీకారం తెలిపింది. హేమంత్మ ధుకర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకి 'సైలెన్స్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ హీరో 'మైఖేల్ మాడ్సన్' కీలకమైన పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. కాగా ఈ సినిమా ఎక్కువభాగం చిత్రీకరణ అమెరికాలో జరగనుంది. అక్కడి షూటింగులో ఆయన పాల్గొంటారట. హాలీవుడ్ స్టార్ హీరో ఈ సినిమాలో చేయనున్నారనే విషయం ఈ సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తోంది. అయితే కథా నేపథ్యం ఏమై ఉంటుందా అనే విషయంపై ఆసక్తి నెలకొంది.