సినిమా వార్తలు

అనుష్క సినిమాలో హాలీవుడ్ నటులు


9 months ago అనుష్క సినిమాలో హాలీవుడ్ నటులు

హీరోయిన్ అనుష్క జి. అశోక్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘భాగమతి’మూవీలో కనిపించిన విషయం విదితమే. ఈ సినిమా మంచి విజయం సాధించింది. భాగమతి సినిమా ఈ ఏడాది జనవరిలో విడుదలైంది. తరువాత అనుష్క తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు. అయితే ఈమధ్యేఅనుష్క తన కొత్త చిత్రాన్ని ప్రకటించింది. ఇది కూడా హారర్, థ్రిల్లర్ చిత్రమే కావడం విశేషం. ఈ చిత్రాన్ని కోన వెంకట్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నటులు నటించనున్నారు. ఈ సినిమా ఎక్కువ శాతం షూటింగ్ అమెరికాలోనే జరగనుందని సమాచారం. ఈ విషయాన్ని కోన వెంకట్ స్వయంగా వెల్లడించారు. అయితే హాలీవుడ్ నటులను తమ సినిమాలోకి ఎలా తీసుకొచ్చారో కోన వెంకట్ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. ‘‘ఇదంతా బాహుబలి కారణంగానే జరిగింది. మేము బాహుబలి సినిమాలో నటించిన అనుష్క తమ సినిమాలో నటిస్తోందని చెప్పగానే హాలీవుడ్ యాక్టర్స్ సంతోషంగా ఒప్పుకున్నారు. బాహుబలి సినిమా కారణంగా అనుష్క అందరికీ తెలిసింది’’ అని కోన వెంకట్ వివరించారు.