సినిమా వార్తలు

ఎన్టీ‌ఆర్‌ను పట్టివ్వండి : వర్మ


11 months ago ఎన్టీ‌ఆర్‌ను పట్టివ్వండి : వర్మ

మొన్నటిమొన్న ఏపీ సీఎం చంద్రబాబు పోలికలు కలిగిన వ్యక్తిని పట్టకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ... ఇప్పుడు ఎన్టీఆర్ పోలికలు కలిగిన వ్యక్తిని కనుగొనే పనిలో పడ్డారు. తాను త్వరలో తీయబోతున్న‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కోసం సన్నాహాలు ముమ్మరం చేశారు రామ్ గోపాల్ వర్మ. రాకేశ్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాను, ఈ నెల 19వ తేదీన తిరుపతిలో ప్రారంభించనున్నట్ల వర్మ ప్రకటించారు.

ఈ సినిమాలో చంద్రబాబునాయుడు పాత్ర కోసం ఆ పోలికలతో ఎవరైనా వుంటే చెప్పండి .. లక్ష రూపాయలు కానుకగా ఇస్తానని ఇటీవల వర్మ ప్రకటించిన విషయం విదితమే, దీంతో చంద్రబాబు పోలికలు కలిగిన వ్యక్తిని  రోహిత్ అనే యువకుడు కనుగొని వర్మకు తెలియజేశాడు. దీంత వర్మ అతనికి లక్ష రూపాయల బహుమతిని అందజేశాడు. తాజాగా ఎన్టీ రామారావు పోలికలతో ఎవరైనా కనిపిస్తే చెప్పండి. 10 లక్షలు బహుమతిగా ఇస్తానని వర్మ ప్రకటించాడు. లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ కలుసుకున్నప్పుడు ఆయన ఎలా వుండేవారో .. అలాంటి పోలికలు కలిగిన వ్యక్తి వివరాలు తెలియజేయండి .. అందుకు సంబంధించిన వీడియోను laksmisntr@gmail.comకి పంపించండి అని ప్రకటించాడు. ఇప్పడు దీని ప్రతిస్పందన కోసం వర్మతోపాటు తెలుగు ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు.