సినిమా వార్తలు

‘మజిలీ’లో హైలెట్సివే!


9 months ago ‘మజిలీ’లో హైలెట్సివే!

హీరో నాగ చైతన్య, సమంత జంటగా శివ నిర్వాణ 'మజిలీ' అనే సినిమాను రూపొందిస్తున్నవిషయం విదితమే. విభిన్నమైన కంటెంట్ తో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా 50 శాతానికి పైగా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. 1990 నాటి ప్రేమకథ నేపథ్యంలో ఈ సినిమా కొనసాగనుంది. నాగచైతన్య, సమంత కాంబినేషన్లో వచ్చే రొమాంటిక్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ రొమాంటిక్స్ సీన్స్ ను చాలా సహజంగా చిత్రీకరించారని తెలుస్తోంది. ఈ సినిమాలో సమంతతో పెళ్లికి ముందు ఒక లుక్ తో, పెళ్లి తరువాత మరో లుక్ తో చైతూ కనిపిస్తాడని అంటున్నారు. దివ్యాంశ కౌశిక్ కీలకమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చారు. ఏప్రిల్‌లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. పెళ్లయిన తరువాత చైతూ, సమంత కలిసి చేస్తోన్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.