సినిమా వార్తలు

ఇక‌పై ఎంతో ఫ‌న్‌: హీరో వెంక‌టేష్‌


10 months ago ఇక‌పై ఎంతో ఫ‌న్‌: హీరో వెంక‌టేష్‌

బుధవారం నుంచి ఎంతో ఫన్‌గా ఉంటుందని విక్టరీ వెంకటేశ్ అంటున్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘f2’. ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌ అనేది దాని ఉపశీర్షిక. అనిల్‌ రావిపూడి ఈ చిత్రానికి దర్శకుడు. వరుణ్‌ తేజ్‌ మరో కథానాయకుడు. తమన్నా, మెహరీన్‌ కథానాయికలు. అయితే బుధవారం ఈ చిత్రంలోని ‘ఎంతో ఫన్‌’ అనే పాటను విడుదల చేస్తున్నారట. ఈ విషయాన్ని వెంకటేశ్‌ వెల్లడించారు.‘ ‘f2’ నుంచి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన మరో పాట రేపు విడుదల కాబోతోంది. ఈ పాటను చిత్రీకరిస్తున్నంత సేపు ఎంతో ఎంజాయ్‌ చేశాం. లిరిక్స్‌ చాలా బాగున్నాయి. బుధ‌వారం నుంచి ‘ఎంతో ఫన్‌’గా ఉంటుంది’ అని పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన ‘రెచ్చిపోదాం బ్రదరూ..’ అనే తొలి లిరికల్‌ పాటకు మంచి స్పందన లభించింది. జనవరి 12న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు.