సినిమా వార్తలు

డీఎస్పీ చెప్పాడు... రామ్ పాడాడు


1 year ago డీఎస్పీ చెప్పాడు... రామ్ పాడాడు

తమదైన నటనతో జేజేలు కొట్టించుకుంటున్న నటులంతా తమ గళాన్నీ పరీక్షించుకోవాలనుకుంటుంటారు. ఈ కోవలోనే చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ ఇలా చాలామంది హీరోలు తమ గొంతును సవరించి పాటలు పాడినవారే. ఇప్పుడు ఈ జాబితాలో హీరో రామ్ కూడా చేరాడు. తన తాజా చిత్రం ‘హలో గురూ ప్రేమ కోసమే’ చిత్రంలో ఆయన పాట పాడారు. సంగీత స్వరకర్త దేవి శ్రీ ప్రసాద్ ప్రోత్సాహంతో రామ్ ఈ సినిమాలో ఓ పాట పాడి, సరికొత్తగా సింగర్ అవతారం ఎత్తారని తెలుస్తోంది.

దీనికిగోడు మంచి లవ్ సబ్జెక్ట్ తో ఎంటర్ టైనర్ గా సాగనున్న ఈ చిత్రంలో రామ్ కొత్తగా కనిపించనున్నారని, తన కామెడీ టైమింగ్ దగ్గర నుంచి, తన మాడ్యులేషన్ వరకు ఎంతో శ్రద్ద తీసుకోని మరీ ఈ చిత్రంలో రామ్ కొత్తగా ప్రయత్నిస్తున్నారని సమాచారం. రామ్ సరసన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ప్రణీత సుభాష్ మరో హీరోయిన్ గా కనిపించనుంది. ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ ఎంటర్టైనర్ ను దసరా కానుకగా అక్టోబర్ 18 న విడుదల కానుంది.