సినిమా వార్తలు

‘ఆ లక్ష్మీపార్వతినే ఎందుకు?.. ఎందుకు?.. ఎందుకు?’ పాట విడుదల


8 months ago ‘ఆ లక్ష్మీపార్వతినే ఎందుకు?.. ఎందుకు?.. ఎందుకు?’ పాట విడుదల

ఇటీవలే ‘వెన్నుపోటు’ పాట విడుదల చేసి టీడీపీ నేతలు, కార్యకర్తల నుంచి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్న వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నుంచి మరో పాటను విడుదల చేశారు. ‘జయసుధ.. జయప్రద.. శ్రీదేవీ..!.. వీళ్లందరినీ వదిలి ఆ లక్ష్మీపార్వతినే ఎందుకు?.. ఎందుకు?.. ఎందుకు?’ అంటూ సాగే పాట టీజర్‌ను ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు. అలాగే ఈ పాటలో వచ్చే ప్రశ్నల గురించి టీజర్‌లో ప్రస్తావించారు. ఈ పాటలోని ప్రశ్నల వెనుక.. అబద్ధాలుగా చెలామణి అవుతున్న నిజాలను నిజాలుగా మసిపూసుకున్న అబద్ధాలను బండకేసి కొట్టి ఉతికి ఆరేయటమే లక్ష్మీస్ ఎన్టీఆర్ ధ్యేయం అని వర్మ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశం నుంచి ఎన్నో విషయాలను ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో వర్మ చూపించబోతున్నారు. వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి తమ్ముడు కల్యాణీ మాలిక్ సంగీతం సమకూరుస్తున్నారు.