సినిమా వార్తలు

అనుష్క కొత్త చిత్రం కథ ఇదే!


7 months ago అనుష్క కొత్త చిత్రం కథ ఇదే!

కథాకథనాల్లో నవ్యత, పాత్రలో కొత్తదనం ఉంటేనే అనుష్క ఆ పాత్ర చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. అందుకే 'భాగమతి' తరువాత ఆమె మరో ప్రాజెక్టును ఓకే చేయడానికి చాలా ఆలస్యమైంది. ప్రస్తుతం ఆమె హేమంత్ మధుకర్ దర్శకత్వంలో చేయడానికి సిద్ధంమవుతోంది. కథాపరంగా ఉండేలా ఈ సినిమాకి 'సైలెన్స్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. మైఖేల్ మాడిసన్ అనే హాలీవుడ్ నటుడితో పాటు, అంజలి, షాలిని పాండే, మాధవన్, సుబ్బరాజు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.  అనుష్క ఎన్నారై యువతిగా, అంజలి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా కనిపిస్తారట. మార్చి నుంచి ఈ సినిమా షూటింగు విదేశాల్లో జరగనుందని తెలుస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ సినిమాతో అనుష్క ఖాతాలో మరో భారీ విజయం చేరిపోవడం ఖాయమని అభిమానులు అంటున్నారు. కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలసి నిర్మిస్తోన్న ఈ సినిమాను, తెలుగుతో పాటు తమిళంలోను విడుదల చేయనున్నారు.