సినిమా వార్తలు

‘బిగ్‌బాస్-3’లో ఉండబోయేది వీరేనా?


9 months ago ‘బిగ్‌బాస్-3’లో ఉండబోయేది వీరేనా?

'బిగ్ బాస్' .. 'బిగ్ బాస్ 2' షోలు విజయవంతం కావడంతో, 'బిగ్ బాస్ 3' కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాంతో 'బిగ్ బాస్ 3' షోను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించడానికి నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయబోయేది వీరేనంటూ కొంతమంది సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. రేణు దేశాయ్, ఉదయభాను, శోభిత ధూళిపాళ, గద్దె సిందూర,యూట్యూబ్ స్టార్ జాహ్నవి, వరుణ్ సందేశ్, కమల్ కామరాజు, జాకీ, హేమచంద్ర, రఘు మాస్టర్, 'జబర్దస్త్' పొట్టి నరేశ్ తదితరులు ఉండనున్నారనే ప్రచారం సాగుతోంది.

ఇక ఈ షోకి హోస్ట్ గా చిరంజీవిగానీ, వెంకటేశ్ గాని వ్యవహరించవచ్చని సమాచారం. క్రితంసారి ఈ షోకి సంబంధించిన విషయాలు కొన్ని ముందుగానే లీక్ కావడం నిర్వాహకులను ఇబ్బందులకు గురిచేసింది. అందుకే ఈ సారి అలాంటివేం జరగకుండా నిర్వాహకులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం.