సినిమా వార్తలు

న‌రేంద్ర మోడీ ప‌స్ట్ లుక్ అదుర్స్‌


6 months ago న‌రేంద్ర మోడీ ప‌స్ట్ లుక్ అదుర్స్‌

ఇప్పుడు బయోపిక్ ల జోరు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ జీవితచరిత్రను తెరపైకి తీసుకురావడానికి బాలీవుడ్లో సన్నాహాలు జ‌రుగుతున్నాయి. నరేంద్ర మోదీ బాల్యం .. విద్యాభ్యాసం, రాజకీయ ప్రవేశం, ఎదిగిన తీరు ఈ బయోపిక్ లో చూపించనున్నారు. వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రధారిగా కనిపించనున్న ఈ సినిమాకి ఒమంగ్ కుమార్ దర్శకుడు.. ఈ బయోపిక్ కి 'పీఎమ్ నరేంద్ర మోదీ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ ఫస్టులుక్ పోస్టర్ ను 23 భాషల్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ లాంచ్ చేశారు. నరేంద్ర మోదీ లుక్ లో వివేక్ ఒబెరాయ్ బాగా ఒదిగిపోయాడు. సురేశ్ ఒబెరాయ్ .. సందీప్ సింగ్ ఈ సినిమాకి నిర్మాతలు.