సినిమా వార్తలు

రామ్ చరణ్ డైట్ ప్లాన్ ఇదే!


8 months ago రామ్ చరణ్ డైట్ ప్లాన్ ఇదే!

డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వాని జంటగా నటించిన సినిమా ‘వినయ విధేయ రామ’. ఈ చిత్రంలో చెర్రీ సిక్స్ ప్యాక్‌తో కనిపించనున్నారు. దీనికి కారణం మెగా పవర్ స్టార్ అనుసరించిన డైటేనట. రాకేష్ ఉడియారా ఇచ్చిన డైట్‌ను రామ్ చరణ్ ఫాలో అయ్యాడని ఉపాసన వెల్లడించారు. చెర్రీ రోజులో ఏమేం తీసుకునేవారనే వివరాలను తెలియజేస్తూ డైట్ ప్లాన్‌ని ఉపాసన ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

చెర్రీ తన డైట్ ప్లాన్‌ ఇదే..

ఉదయం 8 గంటలకు...

3 ఎగ్ వైట్స్, 2 ఫుల్ ఎగ్స్, ఆల్మండ్ మిల్క్‌తో ముప్పావు కప్పు ఓట్స్, 11:30కి ఒక పెద్ద కప్పు క్లియర్ వెజిటేబుల్ సూప్, 

మధ్యాహ్నం... 

200 గ్రాముల చికెన్ బ్రెస్ట్, ముప్పావు కప్పు బ్రౌన్ రైస్, అరకప్పు గ్రీన్ వెజిటెబుల్ కర్రీ, 

సాయంత్రం 4 గంటలకు.. 

250 గ్రాముల గ్రిల్డ్ ఫిష్, 200 గ్రాముల స్వీట్ పొటాటో, అరకప్పు గ్రీన్ వెజిటేబుల్స్, 

సాయంత్రం 6 గంటలకు... 

పెద్ద మిక్స్‌డ్ గ్రీన్ సలాడ్, పావుకప్పు అవకాడో, ఒక కప్పు నట్స్.. ఇదీ చెర్రీ డైట్ ప్లాన్. ఒకవేళ ఉదయం 8 నుంచి 

సాయంత్రం 6 గంటల మధ్య ఆకలైతే... 

నట్స్‌కానీ, రా వెజిటెబుల్స్ కానీ తీసుకునేవాడని ఉపాసన ట్వీట్‌లో వెల్లడించారు.