సినిమా వార్తలు

చైతూ, స‌మంత‌ల జాయింట్ రెమ్యున‌రేష‌న్ ఎంతంటే?


9 months ago చైతూ, స‌మంత‌ల జాయింట్ రెమ్యున‌రేష‌న్ ఎంతంటే?

కొత్త జంట  చైతూ .. సమంత తొలిసారిగా కలిసి 'మజిలీ' సినిమా చేస్తున్నారు. ఇటీవలే డెహ్రాడూన్ .. విశాఖపట్నంలలో ఈ సినిమాకి సంబంధించిన ముఖ్య‌మైన సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రధాన పాత్రధారుల కాంబినేషన్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి గాను సమంత ఎంత పారితోషికం తీసుకుంటోంది? చైతూకు ఎంత ముడుతోంది? అనే విషయంలో ఫిల్మ్ నగర్లో చర్చలు నడుస్తున్నాయి. ఎవరికి ఎంత అనే విషయంలో లెక్కలకి అవకాశం లేకుండగా, ఈ ఇద్దరూ కలిసి జాయింట్ రెమ్యునరేషన్ గా నిర్మాత నుంచి 6 కోట్ల 50 లక్షల రూపాయలను అందుకున్నట్టుగా స‌మాచారం. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే 50 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుంది. వేసవి సెలవుల్లో ఈ సినిమాను విడుదల చేయ‌నున్న‌ట్లు స‌మాచారం